బిఎస్పీ బిఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్థంతి
జహీరాబాద్ డిసెంబర్ 6 (జనంసాక్షి) బహుజన్ సమాజ్ పార్టీ బహుజన సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గం లోని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు ఆయుధాల అలెగ్జాండర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశానికే దిక్సూచిగా నిలిచినటువంటి మహానీయుడు భారతదేశ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అమలు చేయడానికి చేతగాని ప్రభుత్వాలు ఈరోజు రాజంగాని మార్చాలని కుట్రలు చేస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా వెచ్చరిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ బహుజన సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షురాలు మనియర్ పల్లి నర్సమ్మ తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు, బిఎస్పీ నియోజకవర్గం ఇంచార్జ్ సతీష్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎం పద్మారావు, ఎం శ్రీనివాస్ జహీరాబాద్ మండల ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు ఆశీర్వాదం సిద్ధార్థ్ శివకుమార్ పులేందర్ తదితరులు పాల్గొన్నారు.
బిఎస్పీ బిఎస్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్థంతి




