టిజెఏఫ్ డివిజన్ మహాసభ జయప్రదం చేయండి
ఖమ్మం . తిరుమలాయపాలెం (డిసెంబర్ 06)
ఈ నెల 11వ తేదీన జరగబోయే తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల పాలేరు డివిజన్ మహాసభను జయప్రదం చెయ్యాలని ఆ సంఘం పాలేరు డివిజన్ నాయకులు నూకల దాన కరుణ, పసలాది సత్యనారాయణ తెలిపారు.మంగళవారం స్థానిక మండల కేంద్రమైన తిరుమలాయపాలెం గ్రామంలో జరిగిన టీజేఎఫ్ సన్నాహ సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంకై ఏర్పడ్డ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీజేఎఫ్), జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం తోపాటు, బాధిత కుటుంబానికి పెన్షన్ అందిస్తున్న యూనియన్ టీజేఏఫ్ అని అన్నారు.కరోనా సమయంలో మహమ్మారి బారిన పడిన ఎంతోమంది జర్నలిస్టులకు, యూనియన్లకు అతీతంగా రూ.20 వేలు అందించిన ఘనత టీజేఎఫ్ దేఅని అన్నారు. నిత్యం జర్నలిస్టులు పక్షాన నిలబడే యూనియన్ కి అండగా నిలబడి మరింత బలాన్ని చేకూర్చాలని కోరుతూ..ఈనెల 11వ తేదీన కూసుమంచిలోని శ్రీ యోగనంద కల్యాణ మండపంలో(సబ్ రిజిస్టర్ కార్యాలయం వెనుక) పాలేరు డివిజన్ మహాసభ (టీజేఎఫ్) నిర్వహించడం జరుగుతుందని,ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ తప్పక హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండలంలో పనిచేస్తున్న వివిధ పత్రిక విలేకరులు ఉబ్బని సుందర్ (ఆంధ్రజ్యోతి),పోలెపొంగు నాగరాజు(దిశ),బి.సతీశ్(ఎన్9),జి.శ్రీశైలం(విజన్ ఆంధ్ర),కె.వీరయ్య(ది సౌత్ ఇండియా టైమ్స్),పి. వెంకన్న(జ్యోతి),(వేణు పెన్ పవర్),బాబు(పృద్వి),ఎ. నాగరాజు(హెచ్ఎస్యు), సత్యనారాయణ , రామబ్రహ్మం (జనం సాక్షి).తదితరులు పాల్గొన్నారు.




