Wednesday, 4 November 2026

బిచ్కుందలో ప్రధానమంత్రి కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించిన

బిచ్కుందలో ప్రధానమంత్రి కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించిన
మాజీ ఎమ్మెల్యే తారా
బిచ్కుంద నవంబర్ 12 (జనంసాక్షి) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపాయలు 6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి, కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం జరిగిందని అదేవిధంగా రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల విస్తరణ ఎల్కతుర్తి సిద్దిపేట్ మెదక్, బోధన్ బాసర బైంసా, శిరంచ మహదేవ్పూర్ పనులకు గాను రూపాయలు 2,200 కోట్లతో రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశారని, రైల్వే వ్యవస్థలో 30,000 టన్నుల బొగ్గు త్వరితగతిన సరఫరా అయ్యేలా తద్వారా విద్యుత్ నిరాటంకంగా ఉత్పత్తి జరిగి తెలంగాణ ప్రజలు లాభం పొందేలా రైల్వే మార్గాన్ని భద్రాచలం రోడ్ సత్తుపల్లి రైల్వే లైన్ ను జాతికి అంకితం చేయడం జరిగిందని జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరుణ తారా అన్నారు. ఈ కార్యక్రమాన్ని జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలకేంద్రంలోని సద్గురు బండయప్ప స్వామి కాశీ విశ్వనాథ మఠంలో ప్రధానమంత్రి కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా భాజాపా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు అరుణ తారాతో పాటు జుక్కల్ నియోజకవర్గ కన్వీనర్ శ్రీధర్ పంతులు, బిచ్కుంద మండల అధ్యక్షుడు పెరుగు కిష్టారెడ్డి మరియు నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.