Thursday, 5 November 2026

బిజెపి అభ్యర్థి కోసం ప్రచారం

నల్గొండ,మార్చి9(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రలు బిజెపికి అభ్యర్తిని గెలిపించి మోడీకి కానుకగా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరేల్లి చంద్రశేఖర్‌ కోరారు.  భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని.. ప్రట్టభద్రులందరూ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వాహించారు. పట్టభద్రులు, యువకులు, మేధావులు భాజపా వైపుమొగ్గు చూపుతున్నారన్నారు.  నిజాయితీపరుడైన రామ్మోహన్‌రావును గెలిపించి మోదీకి బహుమతిగా అందజేయలని టిడిపి  కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇదిలావుంటే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే వారికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు వేస్తామని నిరుద్యోగ ఐకాస ప్రకటించింది. వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల నిరుద్యోగ ఐకాస సమావేశం ఇక్కడ జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడక తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం లో నిరుద్యోగ నివారణకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *