Tuesday, 3 November 2026

బిజెపి మండల ఉపాధ్యక్షులుగా సురేష్ నాయక్

బిజెపి మండల ఉపాధ్యక్షులుగా సురేష్ నాయక్

టేకులపల్లి, డిసెంబర్ 4( జనం సాక్షి ):భారతీయ జనతా పార్టీ టేకులపల్లి మండల ఉపాధ్యక్షులు గా బాధవత్ సురేష్ నాయక్ ను నియామకం చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం బీజేపీ టేకులపల్లి మండల కార్యాలయం లో బీజేపీ మండల అధ్యక్షులు దారావత్ బాలాజీ నాయక్ వాంకుడోత్ హతీరామ్ నాయక్ బీజేపీ టీచర్స్ సెల్ జిల్లా కన్వీనర్ చేతుల మీదుగా బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షులు గా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా నాయకులు బాల, వినోద్, యువ మోర్చా నాయకులు తారాచంద్, సందీప్ తదితరులు పాలుగోన్నారు. త్యరలో బిల్లుడుతండాగ్రామ పంచాయతీ పరిధిలో బీజేపీ లో భారీ చేరికలు ఉంటాయి అని వారు తెలిపారు.