బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా నరేందర్…
శంకరపట్నం: జనం సాక్షి జనవరి 4
శంకరపట్నం మండలం బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా దాసారపు నరేందర్ ను నియామకం చేసినట్ల మండల అధ్యక్షుడు చల్ల ఐలయ్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడారు. మండల కేంద్రంలో పార్టీ సమావేశాన్ని నిర్వహించి మొలంగూర్ గ్రామానికి చెందిన దాసారపు నరేందర్ ను మండల ప్రధాన కార్యదర్శిగా, కన్నాపూర్ గ్రామానికి చెందిన పిన్ రెడ్డి సంపత్ రెడ్డి, మెట్ పల్లి గ్రామానికి చెందిన గొట్టే మధు లను మండల ఉపాధ్యక్షులుగా నియామకము చేసి నియామక పత్రాలను అందజేసినట్లు వెల్లడించారు. తమ నియామకానికి కృషిచేసిన మండల నాయకులకు నరేందర్, మధు, సంపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం ఎంపీటీసీ 2 ఏనుగుల అనిల్, దళిత మోర్చా మండల అధ్యక్షుడు కనకం సాగర్, ఎస్టి మోర్చా మండల శాఖ అధ్యక్షులు బిజిలి సారయ్య, నాయకులు సమ్మిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ,జైపాల్, మహేందర్ రెడ్డి, తో పాటు వివిధ గ్రామాల బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా నరేందర్




