Wednesday, 4 November 2026

బాధిత కుటుంబానికి పాలకవర్గం చేయుత

బాధిత కుటుంబానికి పాలకవర్గం చేయుత…
శంకరపట్నం; జనం సాక్షి జనవరి 4
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలో ఆముదాల పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం బుధవారం ఓ బాధిత కుటుంబానికి చేయూతనందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బత్తుల మానస మాట్లాడారు. ఇటీవల మరణించిన బొడిగె భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నబోయిన జంపయ్య, గ్రామ ఎంపీటీసీ,ఎంపీటీసీ ల ఫోరo మండలా అధ్యక్షులు పెద్ది శ్రీనివాస్ రెడ్డి, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.