Thursday, 5 November 2026

బిజెపి మతోన్మాద  కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిద్దాం

బిజెపి మతోన్మాద  కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిద్దాం
సీపీఎం జనచైతన్య యాత్రను ఆదరించండి
సీపీఎం డివిజన్ కన్వీనర్ ఎరవెల్లి నాగరాజు
వేములవాడ, మార్చి 21 (జనంసాక్షి) సిపిఎం వేములవాడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26న వేములవాడ కి వచ్చే జన చైతన్య యాత్రను విజయవంతం చేయాలనీ మంగళవారం స్థానిక తెలంగాణ చౌక్ వద్ద జనచైతన్య పోస్టర్లు ఆవిష్కరించారు, ఈ సందర్బంగా డివిజన్ కన్వీనర్ ఎరవెల్లి నాగరాజు మాట్లాడుతూ  భారతదేశంలో మోడీ అమిషా నేతృత్వంలో కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల కట్టబెడుతూ ప్రజలపై అనేక భారాలు మోపుతున్న పరిస్థితి ఉందన్నారు, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 23 కోట్ల మంది పేదలుగా అత్యంత కటిక దరిద్రాన్ని మోడీ విధానాల వల్ల అనుభవిస్తున్నారని అన్నారు,  భారతదేశమంటే ఆదాని అంబానీ మాత్రమేనని దేశం సొత్తు కూడా వారిద్దరికీ మార్చేశారని అన్నారు, తద్వారా భారతదేశంలో నూనె,  గ్యాస్, పెట్రోల్, డీజిల్ అనేక నిత్యవసర సరుకుల ధరలు మూడింతలుగా పెరిగాయి 2014లో ఉన్న గ్యాస్ ధర 410 నుండి 1200 వరకు చేరింది ఈ ధరల వల్ల కార్పొరేట్ శక్తులకు వేలకోట్ల రూపాయలు లాభాలను పోగేసుకుంటున్నారని అన్నారు,  లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి బలోపేతరం చేసిన ప్రభుత్వ రంగాన్ని వాళ్ళ గుత్తగా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నారని బిజెపిని ఎండగట్టారు, మోడీ అత్యంత ఆప్తుడైన ఆదాని బిజెపి అండతో ప్రజదనాన్ని లూటీ చేసి, కంపెనీలు కొల్లగొట్టాడన్నారు,
ప్రపంచం మానవాభివృద్ధి ఆకలి సూచికలో మన దేశం 141 స్థానంలో ఉందన్నారు, అభివృద్ధి ఎక్కడ జరిగిందనేది  బీజేపీ నేతలు చెప్పాలన్నారుబీజేపీ గద్దెనెక్కినప్పటి నుండి తినే తిండి మీద కట్టుకునే బట్ట మీద లక్షల కోట్ల రూపాయలు పన్నులు వేస్తూ ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నారు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని గద్దెనెక్కి ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని విమర్శించారు,  భారత రాజ్యాంగ లౌకిక విలువలను తూట్లు పొడిచి మనవాద రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది మతసామరస్యాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజల మధ్య నిరంతరం చీలుకలు తీసుకొచ్చేందుకు ముస్లిం, క్రైస్తవులకు వ్యతిరేకంగా సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని ఈ విధానాలకు వ్యతిరేకంగా మతసామరాస్యానికి వ్యతిరేకంగా ఈ యాత్రలు కొనసాగుతున్నాయి బిజెపి విధానాలకు వ్యతిరేకంగా మతసామరస్యానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మనమందరం పోరాడాలి పోరాడకుంటే బిజెపి  యొక్క ఆటలు ఇంకా ముందు ముందు ప్రజలపై తీవ్రమైన దాడులు కొనసాగిస్తుందని అన్నారు,భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకంటే బిజెపిని వేరుగా చూడాలన్నారు ఎందుకంటే బిజెపి ప్రభుత్వం మతపిచ్చితోని ఈ భారతదేశాన్ని ఏలుతుందన్నారు, ఆర్ఎస్ఎస్ విధానాలను ముందుకు తీసుకొచ్చి ప్రజల్ని ఐక్యంగా లేకుండా చేస్తుంది కాబట్టి బిజెపి రాచరిక పరిపాలనకు పోకడలకు వ్యతిరేకంగా ఈ ప్రచార జన చైతన్య యాత్రను ఈనెల 23నుంచి 29 వరకు కొనసాగుతుందన్నారు  29న హైదరాబాదు ఇందిరా పార్కులో పెద్ద ఎత్తున సభ జరుగుతుందని అన్నారు, ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మేధావులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ముక్తికాంత అశోక్, ఎగమంటి ఎల్లారెడ్డి, మల్లారపు ప్రశాంత్, నాయకులు  చిలుక బాబు, గుర్రం అశోక్, మల్యాల నర్సయ్య, పర్శరాం, శ్రీకాంత్, సుధీర్  తదితరులు పాల్గొన్నారు.