బిన్‌ లాడెన్‌ అల్లుడు అరెస్టు

వాషింగ్టన్‌ : అల్‌ఖైదా నేత ఒసామా బిస్‌లాడెన్‌ అల్లుడు సులేమాన్‌ అబూ గేత్‌ను జోర్డాన్‌లో అరెస్టు చేసినట్లు అమెరికా ఫెడరల్‌ అధికారులు వెల్లడించారు. తీవ్రవాదంపై పోరులో సులేమాన్‌ అరెస్టు ఓ కీలకపరిణామమని, ఇతన్ని న్యూయార్క్‌ కోర్టు ముందు నేడు ప్రవేశపెట్టనున్నట్లు అటర్నీ జనరల్‌ హెరిక్‌ హోల్డర్‌ తెలిపారు. అమెరికా పౌరులను చంపిన కేసులో సులేమాన్‌ బిస్‌లాడెస్‌ కూతురు ఫాతిమాను పెళ్లి చేసుకున్నాడు. 9/11 దాడుల అనంతరం ఆగ్ర దేశాన్ని హెచ్చరిస్తూ ఆల్‌జజీరా ఛానల్‌లో సులేమాన్‌ ప్రకటనలు చేశాడు.