Thursday, 5 November 2026

బియ్యపు గింజపై బంగారంతో జై బిఆర్ఎస్

బియ్యపు గింజపై బంగారంతో జై బిఆర్ఎస్*
మెట్పల్లి, డిసెంబర్ 10,
జనం సాక్షి:
టిఆర్ఎస్ పార్టీ , బిఆర్ఎస్ గా ఆవిర్భావం అయిన సందర్భంగా మెట్పల్లి మండలం బండలింగాపురం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు ముప్పిడి సురేష్ బియ్యం గింజపై బంగారం తో బిఆర్ఎస్ అని రాశాడు. మొన్న జగిత్యాల పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, బహిరంగ సభలో బండ లింగాపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించిన శుభ సందర్భంగా కెసిఆర్ కు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కు కృతజ్ఞత గా బియ్యం గింజపై బంగారంతో బిఆర్ఎస్ అని రాసినట్టు పేర్కొన్నాడు.