Thursday, 5 November 2026

నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోండి.

నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోండి.
ప్రైవేటు పాఠశాలలకు వతాస్తు పలుకుతున్న విద్యాధికారులు.
పిడిఎస్ యు తాండూర్ నియోజకవర్గ కమిటీ
తాండూరు డిసెంబర్ 10( జనం సాక్షి)తాండూర్ నియోజకవర్గం లోని ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తూ తమకు ఇష్టం ఉన్నట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో కొన్ని పాఠశాలలు ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారని మరియు ప్రైవేటు పాఠశాలలో కనీసం విద్యార్హతలు లేని టీచర్లను నియమించి నడిపిస్తున్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాధికారులు ఏమాత్రం స్పందించడం లేదని విమర్శించారు. విద్యాధికారులు ప్రైవేటు యజమాన్యంతో కుమ్మక్కయ్యారని అందుకే ప్రైవేటు స్కూళ్ల పైన ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.
త్వరలోనే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పిడిఎస్ యు ఆధ్వర్యంలో ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతామని, నిద్రపోతున్న జిల్లా విద్యాధికారులను నిద్ర లేపేంతవరకు మా పోరాటాలు ఆగవని తెలిపారు.