Tuesday, 3 November 2026

బి.ఆర్.యస్ ప్రభుత్వంతో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం -సండ్ర

పెనుబల్లి, జులై 4(జనం సాక్షి) బి ఆర్ ఎస్ ప్రభుత్వంతో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం జరిగిందని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు,మంగళవారం పెనుబల్లి మండలంవి.యం బంజర్ సప్తపది కళ్యాణ మండపంలో మండల పోడు భూముల గిరిజన రైతులకు హక్కు పట్టాలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కలెక్టర్ వి పి గౌతమ్ , ఐటీడీఏ పీవో పోట్రు గౌతం, డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ విక్రమ్ సిద్ధార్థ సింగ్ లలో కలిసి పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు గిరిజనులు ఆదివాసీలు కోలాటాలతో కోలాభిషేకంతో మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. పోడు పట్టాలను పంపిణీ చేసి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ గిరిజనులకు బంధువై గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులన్ని నేడు 9 సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. ఓట్ల కోసం నేడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోడు భూముల పంపిణీ, 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెబుతున్నారు, గతంలో మీ కాంగ్రెస్ పార్టీగా అధికారంలో ఉన్నది అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పింఛన్ 500, 700 మాత్రమే ఇస్తున్నారు. కానీ తెలంగాణలో 2000, 3000 అందించిన ఘనత కేసీఆర్ దే అన్నారు , వికలాంగులకు చేయూతనివ్వాలని మరో వెయ్యి రూపాయలు పెంచిన ఘనత కూడా కేసీఆర్ దే అని అన్నారు. ఏళ్ల తరబడిన పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ హక్కు పత్రాలు అందిస్తూ, గిరిజన కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నారని, ఇది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ పై బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శిస్తే సహించలేదని హెచ్చరించారు. అభివృద్ధి పనులను మాటలతో కాకుండా లెక్కల రూపంలో ప్రతి గ్రామంలో కరపత్రం ద్వారా వివరించిన ఘనత కూడా బిఆర్ఎస్ దేనని అన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రేస్ అని, స్కాములకు నిలయం కాంగ్రెస్ అని అలాంటిది క్రమశిక్షణ కలిగిన పార్టీపై బురద చల్లడం మానుకోవాలన్నారు.కార్యక్రమంలో ఎం పి పి శ్రీమతి లక్కీ నేని అలేఖ్య,తహశీల్దార్ రమాదేవి, సర్పంచ్ భూక్యా పంతులి, జెడ్ పి టి సి చెక్కిలాల మోహనరావు, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, లక్కినేని వినీల్, చెక్కిలాల లక్ష్మణ రావు, కోటగిరి సుధాకర్ బాబు, భూక్యా ప్రసాద్,చెలికాని నీలాద్రి బాబు, వంగా నిరంజన్,తదితరులు పాల్గొన్నారు.