మోహన్ పేట జూలై 4 జనం సాక్షిగ్రామంలో విస్తారంగా వర్షాలు కురిసి ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కావాలని పంగ సంజీవరెడ్డి, పంగ యాదవరెడ్డి, పంగ నర్సింహారెడ్డి నేతృత్వంలో వేదపండితులచే మైసమ్మదేవతకు హోమం నిర్వహించగా కార్యక్రమానికి మంగళవారం తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ కొనింటి సురేష్ హాజరయ్యారు. మైసమ్మ ఆలయం మూడవ వార్షికోత్సవం సందర్భంగా మహిళలు బోనాలతో పొలాల నడుమన అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. వర్షాలు కురిసి గ్రామంలో పంటలు పండితే అందరికి సిరిసంపదలు చేరతాయని అమ్మవారిని వేడుకున్నారు. వేదపండితుల హోమం పిదప గ్రామస్తులకు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బసవరాజు, రాచన్న, లింగయ్య, నర్సింహారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
వర్షాలు సకాలంలో కృషి పంటలు బాగా పండాలని వరుణ దేవునికి ప్రత్యేక పూజలు రాష్ట్ర సర్పంచుల సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు కే సురేష్




