Tuesday, 3 November 2026

బీఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనాన్నివిజయ వంతం చేయండి

 

 

 

 

 

 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీ   స్థానిక  సింగరేణి ఠాగూర్ స్టేడియంలో  ఈనెల 29 శనివారం జరుగబోయే బి.ఆర్.ఎస్. ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన ఏర్పాట్లను  బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, పట్టణ ఇంఛార్జి  గాండ్ల సమ్మయ్య , క్యాతన్ పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి గురువారం పరిశీలించారు.  ఈ సందర్భంగా  వారు మాట్లాడారు.  బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటి వరకు నాలుగు ఆత్మీయ సమ్మెళనాలు విజయవంతంగా నిర్వహించారని, ఈ నెల 29న శనివారం  రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి వార్డులో ఉన్న బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులు, వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. దాదాపు 10వేల మందికీ భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, గోపురాజం, బైరిమల్ల మొగిలయ్య, ఆసాలరాజన్న, నందిపేట సదయ్య , కౌన్సిలర్లు పోగులమల్లయ్య , జాడి శ్రీనివాస్, రేవెల్లి ఓదెలు, రామిడి ఉమాదేవి, బొద్దుల రమ్య, యువ నాయకులు సత్యపాల్, ఎర్రబెల్లి రాజేష్, రామిడి లక్ష్మీకాంత్ , గాజుల చంద్ర కిరణ్, లడ్డురాకేష్, కలీం, గౌస్, మెరాజ్, ,మణి, మహిళా నాయకురాళ్లు,  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.