పోటీలు హుజూర్ నగర్ ఫిబ్రవరి 8 (జనంసాక్షి): మండలంలోని అమరవరం గ్రామంలో లింగమంతుల స్వామి జాతరను పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి గ్రామీణ కబడ్డీ పోటీలు నిర్వహించారు. బుధవారం ఈ కబడ్డీ పోటీల్లో 36 టీములు పాల్గొన్నారు. రెండో రోజు లీగ్ దశకు చేరే గణపవరం వర్సెస్ దాచారం మధ్య జరుగుతున్న కబడ్డీ మ్యాచ్ ను తిలకిస్తున్న హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచ్ గుజ్జుల సుజాతఅంజిరెడ్డి, ఉప సర్పంచ్ బాల సైదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామిశెట్టి వెంకటేశ్వర్లు, ఉస్తెల లింగారెడ్డి, ఉస్తేల చిన లింగారెడ్డి, కందుల అంజిరెడ్డి, సలీం, వీరారెడ్డి, యూత్ లీడర్స్ సుధీర్ రెడ్డి, వేణు, ఉపేందర్ రెడ్డి, గోపి, సతీష్, నవీన్, క్రీడల నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




