Monday, 2 November 2026

బీఆర్ ఎస్ తొలి అడుగు ఇక్కడే  నుండేనా స్పీకర్ ఎంపీ గా వారి తనయులలో ఒకరు ఎమ్మెల్యే గా

 

 

 

 

 

 

 

 

రుద్రుర్ (జనంసాక్షి):దేశ రాజకీయాల్లో ప్రత్యామ్న్యాంగా ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో లేదని,  జాతీయ అంశాలపై జాతీయ పార్టీల వైఖరి సరిగ్గాలేదన్నదే కేసీఆర్‌ ఆలోచన కాబట్టి ఒక ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో , దేశ రాజకీయాల పై దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగే హక్కు ప్రతిపార్టీకీ ఉంది.  కాంగ్రెస్, బీజేపీ తప్ప మరో జాతీయ పార్టీ కనిపించడం లేదు,   ఒకప్పుడు కాంగ్రెస్ బాగా బలంగా ఉన్న రోజుల్లో బీజేపీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది . కానీ అది ఇప్పుడు కాంగ్రెస్‌లో కనపడటం లేదు,  జాతీయపార్టీగా గుర్తింపు పొందడానికి ఉన్న నియమలకు అనుగుణంగా  రెండు తెలుగు రాష్ట్రాలలో, అలానే తెలుగు రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర,తమిళనాడు, కర్ణాటక,  సరిహద్దు నియోజక వర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి,  తెలంగాణ రాష్ట్రంతో ఆ రాష్ట్రాల ప్రజలకు ఉన్న సరిహద్దు అనుబంధం కేసీఆర్‌కు కలిసిరావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలా ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదగడానికి సీఎం కేసీఆర్ తన తొలి అడుగు బాన్సువాడ మరియు జహీరాబాద్ నుండే అని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయ పడుతున్నారు, ప్రస్తుత జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు మహారాష్ట్ర లో గట్టి పట్టు ఉండటం వలన  ఆయనకు మహారాష్ట్రలో  ఎంపీగా సీట్ ఇచ్చి మహారాష్ట్రలో  బీఆర్ ఎస్ జెండా ఉండేలా వ్యహ రచన చేస్తున్నారని, అందుకే బిఆర్ ఎస్ పార్టీ మీటింగ్ బీబీ పాటిల్ కు పట్టు ఉన్న జిల్లాలో ప్రచారం కొనసాగిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం,  ఇక్కడ ఉన్న జహీరాబాద్ ఎంపి సీటును బాన్సువాడ నియోజకవర్గన్నీ రాష్ట్రంలో  ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసిన , అత్యంత ప్రజాదరణ ఉన్న  సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపి గా చేయాలని, బాన్సువాడ నియోజకవర్గనికి ఎమ్మెల్యే గా పోచారం తనయులలో  ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి  ఇటు రాష్ట్ర రాజకీయలలో అటు జాతీయ రాజకీయలలో పార్టీ స్థానలను పదిల పరుచుకోవడానికి  సీఎం కేసీఆర్ వ్యహ రచన చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయ పడుతున్నారు,