తూప్రాన్ ఏప్రిల్ 30 (జనం సాక్షి) ::: తూప్రాన్ పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనంలో ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఐ వి ఎఫ్ రాష్ట్ర కోశాధికారి 16 వార్డు కౌన్సిలర్ వాసవి మాత విగ్రహ దాత కో డి ప్యాక నారాయణ గుప్తా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాస్ ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు ఐ వి ఎఫ్ మండల అధ్యక్షులు కో డిపాక నాగరాజు పట్టణ అధ్యక్షులు ఉప్పల అశోక్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అశోక్ ఆర్యవైశ్య మహిళా సంఘ అధ్యక్షురాలు గబ్బుల సంతోష ఐ వి ఎఫ్ జిల్లా యూత్ అధ్యక్షులు నీల ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకు తూప్రాన్ పట్టణంలోని శివాలయం నుండి మహిళలు 108 కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆర్యవైశ్య సంఘ భవనమునకు తీసుకువచ్చారు వైశ్య సంఘ భవనంలో విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం 108 కళాశాలతో అమ్మవారిని అభిషేకం ను వేద పండితులు ఉదయ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం కన్నుల పండుగగా వాసవి మాత శోభాయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో పేద పండితులు సలక కృష్ణమూర్తి శర్మ రాజేశ్వర్ శర్మ ఆత్రేయ శర్మ తోపాటు వేద బ్రాహ్మణులను ఘనంగా సత్కరించారు వాసవి మాత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మహిళలకు పసుపు కుంకుమలను నారాయణ గుప్తా అందజేశారు ఈ కార్యక్రమంలో చందా వికాస్ గంప బిక్షపతి కొండా శ్రీనివాస ఉమా శంకర్ భరత్ నగేష్ సిద్ధిరాములు పల్లెర్ల బాలేష్ కుమార్ వీరేష్ విజయ్ కుమార్ అశోక్ వెంకటేష్ రాజు మహిళా సంఘ నాయకురాలు స్వప్న నీలిమ సంధ్య అరుణ లక్ష్మి లతోపాటు పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు




