బీఎస్పీ జాబితా..

` 43 మంది అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితా విడుదల
` బీసీ`26, ఎస్సీ `21, ఎస్టీ`11, ఓసీ`03, మైనార్టీలు 02
హైదరాబాద్‌ బ్యూరో, అక్టోబర్‌ 30 (జనంసాక్షి):తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్‌ఎస్‌ తో అవిూతువిూ తేల్చుకోవాలని భావిస్తున్న బహుజన సమాజ్‌ పార్టీ సోమవారం రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 3న 20 మందితో తొలి జాబితా విడుదల చేసిన బఎస్పీ, తాజాగా 43 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఈ సందర్భంగా విూడియాను ఉద్దేశించి బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌,బిజెపి పార్టీలకు ఓట్లు వేయవద్దన్నారు.తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న అమిత్‌ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.బీసీ కులాలకు చెందిన బండి సంజయ్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేని బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు దేశంలో ప్రధానిగా ఉన్నా బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదన్నారు.బీఎస్పీ జనబలం ముందు కేసీఆర్‌ ధన బలం పనికిరాదన్నారు.ఎన్నికల్లో డబ్బులు పంచే,ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దన్నారు.జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు.పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టారన్న ఆయన మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన నాలుగేళ్లలోనే కుంగిపోవడానికి కారకులు ఇంజనీర్లా లేక కేసీఆర్‌ బినావిూ కాంట్రాక్టర్లా? అని ప్రశ్నించారు.అధికారాన్ని అడ్డుపెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిందన్నారు.వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ దోపిడీ పాలనకు చరమగీతం పాడాలన్నారు.43 అభ్యర్థులతో బీఎస్పీ రెండో జాబితాలో విడుదల చేశారు. ప్రకటించిన మొత్తం 63 అసెంబ్లీ స్థానాలకు తొలి,రెండో విడత జాబితా కలిపి బీసీ`26,ఎస్సీ `21,ఎస్టీ`11,ఓసీ`03, మైనార్టీలు`02 లకు సీట్లు కేటాయించారు.
రెండో విడత అభ్యర్థుల జాబితా ఇదే..
1.బెల్లంపల్లి(ఎస్సీ) : జాడీ నర్సయ్య, మంచార్యాల:తోట శ్రీనివాస్‌, 3.ఆసిఫాబాద్‌ (ఎస్టీ) :కనక ప్రభాకర్‌ 4.బోథ్‌(ఎస్టీ):మెస్రాం జంగుబాపు 5.కామారెడ్డి :ఉడతావర్‌ సురేష్‌ గౌడ్‌
6.కోరుట్ల: నిశాంత్‌ కార్తీకేయ గౌడ్‌ 7.జగిత్యాల:బల్కం మల్లేష్‌ యాదవ్‌ 8.రామగుండం:అంబటి నరేష్‌ యాదవ్‌ 9.సిరిసిల:పిట్టల భూమేష్‌ ముదిరాజ్‌ 10.హుజూరాబాద్‌ :పల్లె ప్రశాంత్‌ గౌడ్‌ 11.దుబ్బాక:సల్కం మల్లేష్‌ యాదవ్‌ 12.ఉప్పల్‌:సుంకర నరేష్‌ 13.రాజెందర్‌ నగర్‌:ప్రొ. అన్వర్‌ ఖాన్‌ 14.చేవేళ్ల(ఎస్సీ):తొండుపల్లి రాజా అలియాస్‌ రాజమహేంద్రవర్మ 15.పరిగి:యంకెపల్లి ఆనంద్‌ 16.మలక్‌ పేట్‌:అల్లగోల రమేష్‌ 17.నాంపల్లి:మౌలానా షఫీ మసూదీ 18.చంద్రాయణగుట్ట:మూల రామ్‌ చరణ్‌ దాస్‌  19.కొడంగల్‌:కురువ నర్మద కిష్టప్ప  20.మహుబూబ్‌ నగర్‌:బోయ స్వప్న శ్రీనివాసులు 21.దేవరకద్ర:బసిరెడ్డి సంతోష్‌ రెడ్డి 22.మక్తల్‌:వర్కటన్‌ జగన్నాధ్‌ రెడ్డి 23.అచ్చంపేట్‌(ఎస్సీ): మెత్కూరి నాగార్జున 24.కల్వకుర్తి:కొమ్ము శ్రీనివాస్‌ యాదవ్‌ 25.షాద్నగర్‌:పసుపుల ప్రశాంత్‌ ముదిరాజ్‌ 26.కొల్లాపూర్‌:గగనం శేఖరయ్య 27.హుజూర్‌ నగర్‌:రాపోలు నవీన్‌ 28.మునుగోడు:అందోజు శంకరాచారి 29.ఘన్పూర్‌ :స్టేషన్‌ (ఎస్సీ):తాళ్లపల్లి వెంకటస్వామి 30.పాలకుర్తి : సింగారం రవీంద్రగుప్త 31.డోర్నకల్‌(ఎస్టీ) :గుగూలోత్‌ పార్వతీనాయక్‌ 32.నర్సంపేట్‌:డా.గుండాల మధన్‌ కుమార్‌  33.వరంగల్‌ ఈస్ట్‌:చిత్రపు పుష్పతలయ 34.వర్థన్పేట్‌(ఎస్సీ):డా.వడ్డేపల్లి విజయ్‌ కుమార్‌ 35.ములుగు(ఎస్టీ):భూక్యా జంపన్న నాయక్‌ 36.పినపాక(ఎస్టీ):వజ్జ శ్యామ్‌ 37.మధిర(ఎస్సీ):చెరుకుపల్లి శారద 38.ఆశ్వారావుపేట్‌(ఎస్టీ):మడకం ప్రసాద్‌ 39.భద్రాచలం(ఎస్టీ):ఇర్పా రవి 40.ఇబ్రాహీం పట్నం :గొరిగే మల్లేష్‌ యాదవ్‌ 41.మహబూబాబాద్‌ : గుగులోత్‌ శంకర్‌ నాయక్‌ 42.శేరిలింగంపల్లి :ఒంగూరి శ్రీనివాస్‌ యాదవ్‌
43.వేములవాడ :గోలి మోహన్‌