Tuesday, 3 November 2026

బీఎస్పీ దీక్షకి మద్దతిచ్చిన తెలంగాణ జన సమితి నాయకులు

మెట్పల్లి టౌన్, మార్చి05,జనంసాక్షి :
టీయస్ పియస్సి పేపర్ లీకేజీకి నిరసనగా మెట్ పల్లి పట్టణం లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఒక్కరోజు రిలే నిరాహార దీక్షలో తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేపర్ లీకేజీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల అందరి హస్తం ఉందన్నారు. కల్వకుంట్ల కుటుంబ స్కాములో బలైన దాదాపు ముప్పై లక్షల నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. లీకేజీ స్కామ్ కి సంబంధించిన మరిన్ని నిజ నిజాలు బయటపడాలంటే కేసుని సీబీఐ కి అప్పగించడంతో పాటు, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు పసునూరి శ్రీనివాస్, జిల్లా విద్యార్థి సమితి అధ్యక్షుడు జిల్లపెల్లి దిలీప్, జిల్లా యువజన సమితి నాయకులు వన్నెల శశి, నాయకులు రాంపల్లి శ్యామ్, కేశపాక తరుణ్, ఒంటెలు మురళి తదితరులు పాల్గొన్నారు.