Tuesday, 3 November 2026

ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించాలి 

ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించాలి వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 05 (జనం సాక్షి) ఎస్ఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క విధులను సక్రమంగా నిర్వహించి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులే పేపర్ లీక్ చేయడం వల్ల మంచే చదువుకున్న విద్యార్థులు భవిష్యత్తును చీకటిలో నెట్టివేయబడుతుంది గతంలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులే పేపర్ లీవ్ చేయడం జరిగింది కానీ దీనివల్ల గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కూడా భవిష్యత్తునుఅంధకారాలను నెట్టివేయబడ్డారు తెలంగాణ ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహణలో ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్న కొంత మంది ఉద్యోగస్తులు అవినీతికి పాల్పడడం వల్ల అటు విద్యార్థులు నిరుద్యోగ యువకులు నష్టపోతున్నారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తులు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే వారి ఉద్యోగాన్ని తొలగించే జీవో తీసుకువచ్చి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించాలని సామాజిక న్యాయవేదిక వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ వినోద్ కుమార్ గారు కోరినారు