మిర్యాలగూడ, జనం సాక్షి.
టీ పి పి ఎస్ సి లో ప్రశ్న పత్రాల లీకేజీ కి నిరసనగా ఆందోళన చేపట్టిన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఇతర నేతల అరెస్టులను నిరసిస్తూ మిర్యాలగూడ బీ .ఎస్.పి పార్టీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జాడీ రాజు మాట్లాడుతూ నిరుద్యోగుల తలరాతలను మార్చే టి పి పి ఎస్ సి లో ప్రశ్నాపత్రాల లీకేజీ కేవలం ప్రభుత్వ అసమర్థత అని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన నేతలను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైన తెలంగాణ సర్కార్ ప్రశ్నాపత్రాలు లీకుల విషయంలో నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు రమేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ గుండెబోయిన నాగేశ్వరావు యాదవ్, అధ్యక్షులు అంకెపాక కోటేష్, విశ్వనాధ్,స్వప్న, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు




