రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి
మోమిన్ పేట మర్పల్లి బృందం మార్చి 17( జనం సాక్షి)
ప్రకృతి వైపరీత్యాలు బాధాకరం
ఈ సమయంలో రైతులు ధైర్యంగా ఉండాలని, రైతులకు భరోసా, ధైర్యాన్ని కల్పించడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.శుక్రవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మోమిన్ పేట మండలాల్లో నిన్న కురిసిన భారీ వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు, రైతులను కలిసేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయనతో పాటు విచ్చేసిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ లతో కలిసి పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మనది అగ్రగామి వ్యవసాయ రాష్ట్రం.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు బిడ్డలు చదువుకుంటు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు. అకాలవర్షాల బారిన పడకుండా మార్చి నెలాఖరు లోపు యాసంగి పంటలు చేతికి వచ్చేలా రైతులు సీజన్ కు ఒక నెల ముందుకు జరుపుకుని ప్రణాళికా బద్ధంగా సాగుచేయాలన్నారు.
ఈ విషయంలో రైతులను చైతన్యం చేస్తున్నాం .. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, సూర్యాపేట ప్రాంతాలలో రైతులు దీనిని అనుసరిస్తున్నారని అన్నారు. ప్రతిసారి మార్చి, ఏప్రిల్ నెలలలో పకృతి వైపరీత్యాలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారని,
రాష్ట్రంలో 72 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయని తెలియజేశారు.
నిన్నటి వడగండ్ల వానతో ఇక్కడ ఉన్న చింతచెట్టు ఆకులు కూడా రాలాయని, వడగండ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు.
క్యాబేజీ, ఉల్లి, మక్కా, పుచ్చకాయ, క్యాప్సికం పంటలు బాగా దెబ్బ తిన్నాయని, పంటలకు ఏ నష్టం జరిగినా ఆ రైతు చాలా బాధపడతాడని తెలుపుతూ,
మీలో ధైర్యాన్ని నింపడానికి, భరోసా కల్పించడానికి మేము పర్యటనకు వచ్చామన్నారు.
రైతులకు పంట పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ లేదని తెలిపారు. దేశంలో సమగ్రమైన వ్యవసాయ విధానం లేదని, ఉపాధి హామీ ,వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని అన్నారు.అకాల వడగండ్ల వర్షం తీవ్రత మర్పల్లి, మోమిన్ పేట్ మండలాలలోని 13 గ్రామాలలో ఉందని, దాదాపు 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని
నష్టపోయిన రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని తెలియజేశారు.పంట నష్టపోయిన రైతుల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పంట నష్టంకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి రేపటి వరకు ప్రభుత్వానికి అందించాలని మంత్రి కలెక్టర్ మరియు ఉన్నతాధికాలను సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమీషనర్ రఘునందన్ రావు, ఉద్యానశాఖ సంచాలకులు హన్మంతరావు, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి, వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, మర్పల్లి మోమిన్ పేట, నవాబ్ పేట్ తహసిల్దార్లు, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ ఎంపీపీలు బంటు లలిత రమేష్ వసంత వెంకట్ డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి డి వెంకట్ మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షులు శ్రీనివాస్ హరి శంకర్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు బాధాకరం రైతులు ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పిన




