బీఎస్పీ మండల అధ్యక్షుడిగా జెట్టి శ్రీనివాస్ నియామకం

ధర్మపురి( జనం సాక్షి) మండలం తెనుగు వాడ శుక్రవారం ఉదయం జట్టి శ్రీనివాస్ ముదిరాజ్ వెంకట్ నరసయ్య ను బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి ఇన్చార్జ్ నక్క విజయ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడిగా జట్టి శ్రీనివాస్ ముదిరాజ్ నియమించడం జరిగింది. జెట్టి శ్రీనివాస్ ముదిరాజ్ అనేక సేవా కార్యక్రమాలు మరియు మంచి మనసున్న వ్యక్తిగా గుర్తించి బహుజన రాజ్య స్థాపనకు సరైన వ్యక్తిగా పార్టీ గుర్తించి ఈ యొక్క నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ సూచించిన పనులను కార్యక్రమాలను తూచా తప్పకుండా చేస్తానని బహుజన రాజ్యం వచ్చేంతవరకు మడిమ తిప్పకుండా పని చేస్తానని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా అసెంబ్లీలో బీసీల వాటా ఎంత అని వారు ప్రశ్నించారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీదున్న నమ్మకంతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఊరూరా తిరిగి ఏనుగు గుర్తు గురించి బహుజన వాదం గురించి వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు కుషనపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బచ్చల స్వామి, జనరల్ సెక్రెటరీ నక్క గంగాధర్, పెగడపల్లి మండల అధ్యక్షుడు గొడుగు నరేష్,బుగ్గారం మండల అధ్యక్షుడు గజ్జల స్వామి, గొల్లపల్లి మండల అధ్యక్షుడు కల్లేపల్లి తిరుపతి, జగదేవ్పేట్ గ్రామ అధ్యక్షుడు శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు