Tuesday, 3 November 2026

బీఎస్‌ఆర్‌, వైకాపాలు అవినీతితో పుట్టిన కవలలు: నారాయణ

బళ్లారి : కర్ణాటకలో బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అవినీతితో పుట్టిన కవల పిల్లలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నుంచి పోటీ చేస్తున్న సీపీఐ అభ్యర్థి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. మాఫీయా పార్టీలకు ఓట్లు వేయవద్దని ఓటర్లకు సూచించారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ మంత్రులు అవినీతి కార్యక్రలాపాలకు చిరునామాగా నిలిచారని ఆరోపించారు. 30 స్థానాల్లో పోటీ చేస్తున్న తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *