Wednesday, 4 November 2026

బీచుపల్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

 ఇటిక్యాల –( జనం సాక్షి):– మార్చి 24:–
 తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆంజనేయ గౌడ్ శుక్రవారం ఇటిక్యాల మండల పరిధిలోని బీచుపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామిని మొదటిసారిగా దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా ఆయనకు స్వాగతం పలికారు.దేవాలయ సన్నిధిలో ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.  దేవాలయ అర్చకులు ఆంజనేయ గౌడ్ ను శాలువతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.తదనంతరం ఆయన ఎర్రవల్లి చౌరస్తాలోని ఎస్ వి ఆర్ నగర్ లో సంచార జాతుల జిల్లా అధ్యక్షుడు ఆత్మీయుడు బొప్పల శ్రీనివాసులు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి
జోగులాంబ గద్వాల్ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతియ్య ,
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలియజేసి వారు ఇచ్చిన అతిథ్యాన్ని స్వీకరించారు.
 అదేవిధంగా అనారోగ్యం నుండి  కోలుకున్న మాజీ  పిఏసీఎస్ అధ్యక్షుడు బండ్ల చంద్రశేఖర్ రెడ్డిని గద్వాలలో  ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ లు పరామర్శించి ఆయన ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట జై నడిగడ్డ యువత మిత్ర బృందం, జై నడిగడ్డ యువత  నాయకులు తదితరులు పాల్గొన్నారు .