Wednesday, 4 November 2026

టిఎన్జీవో టేబుల్ క్యాలెండర్ మరియు జిల్లా డైరీ ఆవిష్కరణ

  కొల్లాపూర్ మార్చి24 జనంసాక్షి  ఈరోజు కొల్లాపూర్ టిఎన్జిఓ డివిజన్ యూనిట్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో కొల్లాపూర్ టీఎన్జీవో యూనిట్ టేబుల్ క్యాలెండర్ మరియు నాగర్కర్నూల్ టీఎన్జీవో జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొల్లాపూర్ డివిజన్ ఆర్డీవో  శ్రీ హనుమా నాయక్ కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ జయచంద్ర ప్రసాద్ యాదవ్  కొల్లాపూర్ తహసిల్దార్ శ్రీ రమేష్ నాయక్  కొల్లాపూర్ ఎంపీడివో శ్రీనివాసులు  ఎంపీఈవో మనోహర్ మరియు నాగర్ కర్నూల్ జిల్లా టీఎన్జీవో యూనియన్ సహా అధ్యక్షులు పసుల సత్యనారాయణ యాదవ్ వారిఆధ్వర్యంలో కొల్లాపూర్ యూనిట్ టేబుల్ క్యాలెండర్ మరియు జిల్లా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ టీఎన్జీవో యూనిట్ అధ్యక్షులు జీకే వెంకటేష్ కార్యదర్శి ఏ సురేందర్ కోశాధికారి నాగరాజు సహ అధ్యక్షులు డీకే గణేష్ బాబు ఉపాధ్యక్షులు ప్రేమ్ చంద్,శోభారాణి, పబ్లిసిటీ సెక్రటరీ దాసరి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి జంబులు ఈసీ నెంబర్  నర్మద  మరియు కొల్లాపూర్ డివిజన్ వివిధ శాఖల టీఎన్జీవో ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్డీవో హనుమ నాయక్ ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగస్తులకు త్వరలో పిఆర్సి డిఏలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు త్వరగా వచ్చే విధంగా సెంట్రల్ TNGO యూనియన్ ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దుచేసి జిపిఎఫ్ ను అమలుపరచాలని టీఎన్జీవో యూనియన్ తరపున ప్రభుత్వాన్ని కి విన్నవించి సమస్యలు పరిష్కరించుకోవాలని టీఎన్జీవో ఉద్యోగులకు విధి నిర్వహణలో మా అధికారులు ఎప్పుడు సోదర భావంతోటి అన్యోన్యంగ ఉంటారని తెలియ జేశారు. కొన్ని శాఖల ఉద్యోగస్తులకు పని భారము, ఒత్తిడి ఎక్కువగా ఉందని అన్ని శాఖలలో సరిపోయినంత స్టాప్ లేనందున ఉన్న ఉద్యోగస్తుల పైన పనిభారం, ఒత్తిడి ఎక్కువైందని ప్రభుత్వం ఈ సమస్యను సానుకూలంగా స్పందించాలని ఆశా భావం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లా టీఎన్జీవో సహా అధ్యక్షులు పసుల సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ టీఎన్జీవో యూనియన్ అన్ని యూనియన్ల కన్న బలమైన యూనియన్ అని 56 శాఖల ఉద్యోగస్తులుTNGO యూనియన్ లో సభ్యత్వం  తో పనిచేస్తున్నరని స్వాతంత్ర్యం రాకముందు నుండే TNGO ఏర్పడినదనిప్రభుత్వం నుండి  ఉద్యోగుల  చాలా సమష్యాలు  TNGO యూనియన్ పరిష్కరించి నదని తెలియ జేశారు.అనంతరం ముఖ్యాతిథులు RDO,హనుమ నాయక్ డాక్టర్ జయచంద్ర ప్రసాద్ యాదవ్ తాసిల్దార్ రమేష్ నాయక్  MPDO,  శ్రీనివాసులు జిల్లా సహా అధ్యక్షులు పసుల సత్యనారాయణ యాదవ్ MPEOమనోహర్ కొల్లాపూర్ TNGOయూనిట్ తరుపున సన్మానించారు.