బీజింగ్: కరోనా పుట్టినిళ్లు చైనాలో మహమ్మారి విళయతాండవం చేస్తున్నది. కేవలం 30 రోజుల్లోనే 60 వేల మందిని పొట్టనపెట్టుకున్నది. దేశంలో అమలులో ఉన్న జీరో కోవిడ్ పాలసీని డ్రాగన్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 8న ఎత్తివేసింది. దీంతో చైనాలో భారీసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 వరకు కరోనా లక్షణాలతో 59,938 మంది మరణించారని నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) వెల్లడించింది.




