Thursday, 5 November 2026

వివేకానంద జయంతి వారోత్సవాల సందర్భంగా నెహ్రు యువజన కేంద్రం వారి ఆధ్వర్యంలో గుమ్మడవల్లి గ్రామంలో జనచైతన్య యువజన సంఘం

వివేకానంద జయంతి వారోత్సవాల సందర్భంగా నెహ్రు యువజన కేంద్రం వారి ఆధ్వర్యంలో గుమ్మడవల్లి గ్రామంలో జనచైతన్య యువజన సంఘం సామాజిక సేవా కార్యక్రమాలు కొండమల్లేపల్లి జనవరి 16 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండలం గుమ్మడవల్లి గ్రామంలో మహనీయులు వివేకానంద జయంతి వారోత్సవాల సందర్భంగా నెహ్రూ యువజన కేంద్రం వారి ఆధ్వర్యంలో జన చైతన్య యువజన సంఘం సామాజిక సేవా కార్యక్రమాలు గ్రామంలో ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా జనచైతన్య యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు, స్వచ్ఛంగా గ్రామాల్లో సామాజిక సేవలో పాల్గొంటున్న యువకులు వివేకానంద జయంతి వారోత్సవాల సందర్భంగా మహనీయుల స్ఫూర్తితో సమాజ సేవలో ముందుంటున్నారు యువకులు సేవే లక్ష్యంగా విద్య, వైద్య, క్రీడా, సామాజిక సేవా రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతూ యువత ఆదర్శంగా నిలుస్తున్నారు జన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారు సమాజం పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనే లక్ష్యంతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు జన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ముఖ్యంగా విద్యార్థులు యువకులు, చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఉండేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ప్రజలను,యువతను చైతన్యపరిచేందుకు ప్రజా ప్రతినిధులు,అధికారులు,విద్యావంతులు, పోలీసులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నారు సమాజంపై అవగాహన కలిగి ఉండాలి అని యువతకు సమాజంపై అవగాహన కల్పిసున్నాం. యువత తోడ్పాటుతో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రజలకు పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మరుగుదొడ్ల వినియోగం, నిరక్షరాస్యులు ప్రభుత్వ పథకాలు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. గ్రామాల్లో మరిన్ని సమాజిక సేవా కార్యక్రమాలు చేసేందుకు, రాజకీయాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నామని జన చైతన్య యువజన సంఘం సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో కొత్తగొల్ల నరసింహ, కొండమీది శంకర్, డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్,నేతాళ్ళ నాగరాజు, ఇలియాస్,జన చైతన్య యువజన సంఘం సభ్యులు మరియు యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు