Tuesday, 3 November 2026

బీజేపీ, టీఆర్‌ఎస్ కలసిపోయినట్టే : ఉత్తమ్‌

bjpహైదరాబాద్: బీజేపీ, టీఆర్‌ఎస్ కలసిపోవడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యనేతలు మల్లు భట్టివిక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 26 నెలల తర్వాత రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం వల్ల ఒరిగిందేమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో టీఆర్‌ఎస్, బీజేపీ కలసి ప్రయాణం చేస్తాయనే సంకేతాన్ని ఈ పర్యటన ద్వారా ఇచ్చారని చెప్పారు. పొత్తుకోసం రెండు పార్టీలు తహతహలాడిపోతున్నాయని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *