Tuesday, 3 November 2026

బీజేపీ నాయకుల ముందస్తుఅరెస్ట్

 అరెస్ట్బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్
వేమనపల్లి,ఏప్రిల్ 5,(జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ 10వ తరగతి హిందీ పరీక్ష పేపర్ లీకేజీలో హస్తం ఉందని తెలంగాణ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నేపథ్యంలో వేమనపల్లి మండలంలో బీజేపీ నాయకులు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేసి,స్థానిక బీజేపీ నాయకులను నీల్వాయి ఎస్ఎచ్ఓ నరేష్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బుధ‌వారం వేకవజామున అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.అరెస్టు అయిన వారిలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు ఏట మధుకర్,ఎస్సి మోర్చామండల అధ్యక్షుడు దొబ్బల శంకర్,బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు పందుల అశోక్ లు ఉన్నారు.