Wednesday, 4 November 2026

దేశంలోనే  కళ్యాణ లక్ష్మి పథకం గొప్పగా నిలిచింది

దేశంలోనే  కళ్యాణ లక్ష్మి పథకం గొప్పగా నిలిచింది* ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ
టేకులపల్లి, ఏప్రిల్ 5( జనం సాక్షి ): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం దేశంలోనే గొప్పగా నిలిచిపోయిందని, ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఇల్లందు శాసన సభ్యురాలు బానోతు హరిప్రియ అన్నారు. బుధవారం టేకులపల్లి మండలంలోని తహసిల్దార్ కార్యాలయం నందు అర్హులైన 93 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి  చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి అండదండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని వారన్నారు. నిరుపేదింట్లో ఆడపడుచులు ఘనంగా పెళ్లి జరుపుకోవాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. 50వేల రూపాయలు ఉన్న కళ్యాణ లక్ష్మి నేడు అంచెలంచెలుగా పథకంలోని డబ్బులు రెట్టింపు చేస్తూ నేడు రూ.1 లక్ష 116/- రూపాయలను తెలంగాణ లబ్ధిదారులకు అందజేయడం గొప్ప కార్యక్రమం అన్నారు. ఈ పథకంతో  నిరుపేద కుటుంబంలో కళ్యాణ్ లక్ష్మి..కళ్యాణ కాంతులు నిండాయన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో ఉద్యమకారుడుగా తెలంగాణలోని ఒక మారుమూల తండాకు సీఎం కేసీఆర్  వెళ్లారన్నారు. అక్కడ ఒక యువతి తల్లిదండ్రులు ఆమె కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి జమ చేసుకున్న డబ్బులు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయ్యాయన్నారు. కూతురి పెళ్లి ఘనంగా జరుపుకోవాలని ఉద్దేశంతో దాచుకున్న డబ్బు అగ్నికి ఆహుతి కావడంతో ఆ తల్లితండ్రుల రోదనలు మిన్నంటాయన్నారు. ఇది చూసి చలించిపోయిన కేసీఆర్  ఆ యువతి తల్లిదండ్రులకు ఘనంగా పెళ్లి చేసుకునేందుకు తన వంతుగా ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. మరొక విషయం ఏమిటంటే.. సీఎం కేసీఆర్  తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక గతంలో అదే తండా కు చెందిన ఆ యువతి కూ