బీజేపీ పార్టీలో చేరిన సర్పంచ్ బోడి నరహరి”
ఫోటోరైటఫ్: సర్పంచ్ నునావత్ బోడి నరహరి ని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సంకినేని
పెన్ పహాడ్. జనవరి 11(జనం సాక్షి) :తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు బుధవారం మండల పరిధిలోని దుబ్బ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ నూనవాత్ బోడి నరహరితో పాటు 5 వార్డ్ మెంబర్ నూనవత్ యశోద బీజేపీ పార్టీలో చేరగా వారిని పార్టీ కండువాలు కప్పు పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు 1100 కోట్ల అవినీతిలో కూరుకుపోయిన టిఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు గత ఏడాది అవినీతికి పాల్పడిన రైస్ మిల్లులను ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెడితే ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు సంబంధిత అధికారులు ముడుపులు తీసుకొని అనుమతిని ఇచ్చారని ఆరోపించారు జరుగుతున్న అవినీతిలో ,మంత్రి జగదీష్ రెడ్డి ఆస్తం ఉందని ఆరోపించారు గ్రామ పంచాయితీలకు కేంద్ర నిధులు మాత్రమే వస్తున్నాయని రాష్ట్రం గ్రామాలను పట్టించుకోవడం లేదని అన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ తీరిందని రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తోందని తెలిపారు కొందరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పోకల రాములు, గజ్జెల వెంకట్ రెడ్డి,కాపా రవి,కట్కూరు కార్తిక్ రెడ్డి,చెన్నూ రమణారెడ్డి, రంగినేని విజయ్ కుమార్,తూముల సాయి,దామోదర్ రెడ్డి,లకావత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు..




