..బీజేపీ పిలుపు మేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం……….రాష్ట్రంలో జరిగిన టీ స్ పిఎస్సి పేపర్ లికెజ్ ఇప్పుడు పదవ తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల్లో దోషులమవుతున్నామని సిగ్గుతో కక్ష సాధింపు చర్యగా అర్ధరాత్రి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని ఇంట్లో చొరబడి అక్రమంగా అరెస్టు చేయడం . ఈ రోజు తెల్లవారుజామున మంచిర్యాల జిల్లావ్యాప్తంగా నాయకులను మరియు మందమరి మండల అధ్యక్షులు ( పైడిమల్ల నర్సింగ్) ని కార్యకర్తలను అరెస్టు చేయడం నిరసిస్తూ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా బిజెవైఎం మండల శాఖ అధ్యక్షులు (పెంచాల రంజిత్) . మండల ప్రధాన కార్యదర్శి ( వంజరీ వెంకటేష్ ) ఆధ్వర్యంలో మందమర్రి రూరల్ ఆదిల్ పేట చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ప్రతి శాఖలో అవినీతి పెరిగిపోయిందని. ముఖ్యమంత్రి కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని. తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుందని. నిరుద్యోగుల జీవితాలు నాశనం అయ్యాయని వీటన్నిటి పైన తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తూ రాజీలేని పోరాటాలు చేస్తుందని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని. విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రాణాలకు తెగించి పోరాడుతుందని తెలంగాణ ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దురగాతాలను ఎండ కడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాంఈ కార్యక్రమంలోజిల్లా కార్యవర్గ సభ్యులు దొండ సంపత్. బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కాపురపు వినయ్. పొన్నారం బూతు అధ్యక్షులు బోర్లకుంట్ల లక్ష్మణ్. ఆదిల్ పేట బూత్ అధ్యక్షుడు గుర్న రవి. దైతల మారుతి .వినయ్ .మనోహర్. చంద్రయ్య .లవకుశ .వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ పిలుపు మేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం




