బీటి రోడ్డుపనులను పరిశీలించిన ఎంపీపీ జెడ్పిటిసి
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (26): గోపాల్ పేట్ నుండి బుద్ధారం వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులను సోమవారం ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గవి తో కలిసి పరిశీలించారు రోడ్డు పనుల శరవేగంగా పూర్తవుతాయి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను నాణ్యవంతంగా వేస్తున్నారని ప్రజలకు రోడ్ల వల్ల కలిగే ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని అని తెలంగాణ ప్రభుత్వం రోడ్ల పైన ప్రత్యేక దృష్టి సాధించి ప్రతి గ్రామానికి బీటి రోడ్డు వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యులు మతిన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు తిరుపతి యాదవ్,మండల సీనియర్ నాయకులు మంద కోటీశ్వర్ రెడ్డి, పానుగంటి శేఖర్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు




