ఒరిస్సా లో జాతీయ పోటీలు. ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్న సబ్ జూనియర్స్ పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర జట్టు మేనేజర్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం పుల్లూరు సుధాకర్ కోశాధికారి సత్యపాల్ లు వ్యవహరిస్తున్నారు, పుల్లూరు సుధాకర్ ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోని రెండో వార్డ్ కౌన్సిలర్ గా ఉన్నారు, 2018 హైదరాబాద్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్ర జట్టుకు మేనేజర్ గా వ్యవహరించారు, 2019లో అండర్ 15 అండర్ 17 జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న మేనేజర్ గా వ్యవహరించారు, 2018లో, 2019లో సుధాకర్ మేనేజర్ గా వ్యవహరించిన జట్ల క్రీడాకారులు జాతీయ స్థాయిలో విన్నర్స్ గా, రన్నర్ గా నిలిచారు, ఈసారి కూడా మెడల్స్ సాధించే అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడాకారులు జాతీయస్థాయి, పోటీలలో రాణిస్తున్నారని సుధాకర్ తెలిపారు, జిల్లా అసోసియేషన్ బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం బాధ్యులందరి సహకారంతో ముందుకు పోతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బ్యాడ్మింటన్ క్రీడ అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు……………………………జనం సాక్షి..
ఒరిస్సా లో జాతీయ పోటీలు. ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో




