Wednesday, 4 November 2026

బీడీ కార్మికుల ధర్నా

నిజామాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి): ఆంక్షలు లేకుండా పింఛన్లు ఇవ్వాలని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీడీకార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీడీ కార్మికులు కార్యాలయం ఎదుట బీడీలు చుడుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీడీ కార్మికులు మాట్లాడుతూ పీఎఫ్‌ కార్డు సౌకర్యం ఉన్నా పింఛన్ల జాబితాలో తమ పేరు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి షరతులు విధించకుండా బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇప్పించాలని కోరారు. అనంతరం తహసీల్దారు ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సుధాకర్‌ యాదవ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *