Tuesday, 3 November 2026

బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు డప్పులు అందజేత

 

 

 

 

 

 

 

 

ఆత్మకూర్(ఎం) మే 3 (జనంసాక్షి)ఆత్మకూరు గ్రామంలో మాదిగ డప్పు కళాకారులకు టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అయిలయ్య సహకారంతో డప్పులను పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి సర్పంచ్ జన్నాయికోడె నగేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొడ్రాయి పండుగ సందర్భంగా ఆహ్వానించుటకు వెళ్లగా వారు బొడ్రాయి నాభి శిల ప్రతిష్ఠాపన ఉత్సవ కార్యక్రమానికి 1,11,116 రు.లు విరాళం అందించగా మాదిగ డప్పు కళాకారులకు బొడ్రాయి పండుగ కానుకగా 36 మందికి డప్పులు అందించడం జరిగింది అడిగినా అడగకున్న నేను ఉన్నా మీకు అండగా అంటూ బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అయిలన్న సేవలు ఎంత చెప్పిన తక్కువే అని అడగకుండానే కరోనా కష్ట సమయంలో మండల ప్రజలకు నిత్యావసర సరుకులు వాటర్ ప్లాంట్ లు పేదరికంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5000 రు.ల ఆర్థిక సహకారం అత్యవసర సమయంలో ఆంబులెన్సు సౌకర్యం ప్రతి గ్రామానికి మంచి నీళ్ళ క్యాన్లు ఇవ్వడం జరుగుతుంది అని అలాగే ఆత్మకూరు గ్రామ పంచాయతీ ప్రకటనలకు ఊరంతా 3 లక్షల రూపాయలతో మైకు సెట్టింగ్ అందించడం ఎంతో హర్షించదగ్గ పరిణామం అని వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి మనం అందరం అండగా నిలవాలి అన్నారు ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం నాయకులు బొబ్బల అంజి రెడ్డి నోముల వెంకట్ రెడ్డి జన్నాయికోడే యుగంధర్ నాగం లక్ష్మా రెడ్డి ఎద్దు వెంకటేశ్వర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు దొంతరబోయిన భాస్కర్ ఎలగందుల శ్రీను ఎలిమినేటి మురళి తొండల అనిల్ దిగోజు భరత్ తదితరులు పాల్గొన్నారు