Wednesday, 4 November 2026

బీసీలు రాజ్యాధికార సాధన అంతిమ లక్ష్యం కావాలి

– జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్
జనంసాక్షి, మంథని : బీసీలు రాజ్యాధికార సాధనే అంతిమ లక్ష్యంగా పనిచేయాలని పెద్దపెల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. సోమవారం మంథనిలోని తన రాజగృహ నివాసంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తలపెట్టిన చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు మానసిక బలహీనతతో అధికారానికి దూరమవుతున్నారని ఆవేదన చెందారు. 52 శాతం భాగస్వామ్యం గల ఓటర్లతో అవలీలగా అధికారాలను చే చిక్కించుకోవచ్చని అన్నారు. బీసీలలో ఉన్న అనైక్యతతో ఆధిపత్య వర్గాల వారు రాజ్యాధికారంలో ఉంటున్నారని పేర్కొన్నారు. దృఢమైన మానసిక ధైర్యాన్ని నింపేందుకే మంథని లో లో బహుజన రాజ్యాధికార యాత్ర మొదలెట్టనని ఈ సందర్భంగా తెలిపారు. పార్టీల రహితంగా బీసీలు ఐక్యత కావాలని పేర్కొన్నారు. ఆర్ కృష్ణయ్య చేస్తున్న బీసీ ఉద్యమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మునిసిపల్ చైర్మన్ పుట్ట శైలజ, కమాన్పూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు రాచకొండ రవి , గ్రేటర్ హైదరాబాద్ బిసి యూత్ యువజన వైస్ ప్రెసిడెంట్ పందిళ్ళ రవీందర్ ,జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నం ప్రసాద్ గౌడ్, రామగుండం బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వింజమూరు సురేష్, బీసీ మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి బుద్ధుల అరుణ, బిసి సంక్షేమ సంఘం కమాన్‌పూర్ మండల అధ్యక్షుడు దండే కిషన్ తదితరులు పాల్గొన్నారు.