Tuesday, 3 November 2026

బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయను: శ్రీనివాసన్‌

ముంబయి, జనంసాక్షి:  బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయను అని మరోసారి శ్రీనివాసన్‌ స్పష్టం చేశారు. తనపై తరోపణలు లేనప్పుడు  ఎందుకు పదవి నుంచి వైదొలగాలని  ప్రశ్నించారు. గతంలో ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చినప్పుడు బీసీసీఐ ఛీఫ్‌లెవరూ రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు దర్యాప్తులో తాను జోక్యం చేసుకోనని తేల్చిచెప్పారు. దర్యాప్తు ప్యానల్‌ దోషులని తేలిస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌పై చర్యలు తీసుకుంగామని తెలిపారు. శ్రీనివాసన్‌ బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *