బీసీ ఉప ప్రణాళిక కోసం సమావేశాలు నిర్వహిస్తాం : సారయ్య
హైదరాబాద్: బీసీల ఉప ప్రణాళిక రూసకల్పన కోసం వచ్చే శాసనసభ సమావేశాల సమయంలో బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఈ అంశంపై సోనియాగాంధీ, ప్రధానమంత్రిని కలిసే విషయంలో బీసీ నేతలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. బీసీ ఉప ప్రణాళిక కోసం త్వరలోనే శ్రీకారం చుడతామని తెలియజేశారు.



