Wednesday, 4 November 2026

బీహార్‌లో పడవ ప్రమాదం

పాట్నా: బీహార్‌లోని బోజ్‌పూర్‌ జిల్లా కౌరా సమీపంలోని సోన్‌ నదిలో సోమవారం ఉదయం పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 35 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం గాలింపు  చర్యలు చేపట్టింది. రెండు మృత దేహాలను వెలికి తీయగా నలుగురిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.గల్లంతైన మిగతావారి కోసం గాలింపులను కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *