బీహార్లో పడవ ప్రమాదం
పాట్నా: బీహార్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బెగుసరాయ్ జిల్లా మధు రాపూర్ సమీపంలోని గంగా నదిలో ఈ రోజు ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది గల్లంతు కాగా వీరిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



