హైదరాబాద్ : బీహెచ్‌ఈఎల్‌లో దారుణం జరిగింది. బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్‌లో ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వ్యక్తి కత్తితో దాడి చేయడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మహిళపై దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.




