బూరుగడ్డలో వైభవంగా గోదాదేవి కల్యాణం – అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ జనవరి 14 (జనంసాక్షి) : మండలంలోని బూరుగడ్డ గ్రామంలోని శ్రీ శాల్మలి కంద ఆదివరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాలస్వామి దేవాలయంలో వైభవంగా స్వామి గోదాదేవి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఈ కళ్యాణ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షేక్ రంజాన్ సలీమా బేగం, ఎంపీపీ గూడెపుశ్రీనివాస్, మాజీ చైర్మన్ కొత్త నాగరాజు , ధర్మకర్తలు వెంకటేశ్వర్లు, గోపాలం, గురుస్వామి, మట్టయ్య, సైదమ్మ, దేశ్ ముఖ్ అరుణ్ కుమార్, యరగాని నాగన్న, దొంగరి వెంకటేశ్వర్లు, ఈడుపుగంటి సుబ్బారావు, సామలశివారెడ్డి, మంత్రిప్రగడ వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు, భక్తులు, ప్రజలు, మహిళా భక్తులు, ఆలయ ఈవో ఎంపీ లక్ష్మణ్ రావు, అర్చకులు ముడుంబై హరీశా కుమారాచార్యులు, ముడుంబై మనోహరాచార్యులు, యరగాని కిరణ్ గౌడ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
బూరుగడ్డలో వైభవంగా గోదాదేవి కల్యాణం – అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి




