పల్లెల్లో సంక్రాంతి పండుగ సంబరాలు
మహా ముత్తారం జనవరి 14 (జనం సాక్షి) పల్లెల్లో నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేది, సంక్రాంతి పండుగను రైతుల పండుగగా అంటారు. అన్ని గ్రామాలలో తెల్లవారుజామున ఇంటి ముంగిట్లో రంగురంగుల ముగ్గులతో అందంగా వాకిడిని తీర్చిదిద్దుతారు మహిళలు. ఈ సంక్రాంతి పండుగకు పట్టణంలో చదువుతున్న విద్యార్థులు సెలవుల్లో ఇంటికి వస్తే తల్లిదండ్రులు పిల్లలు ఎంతో సంతోషంగా అంగరంగ వైభవంగా ఊరంతా కళకళలాడుతుంది. ఈ సంక్రాంతి పండుగకు మహిళలు పిండి వంటలు సకినాలు, గారెలు, మూర్ఖులు, బూరెలు, అరిసెలు, తదితర పిండి వంటలు తీపి వంటలు చేసుకుంటారు, భోగి రోజు మరియు సంక్రాంతి రోజు పశువులకు వారు చేసుకున్న పిండి వంటలతో పాటు అన్నం పెడతారు.




