బూరుగడ్డ శివాలయంలో లక్ష బిల్వార్చన హుజూర్ నగర్ నవంబర్ 23 (జనంసాక్షి): మండలంలోని బూరుగడ్డ శ్రీ నల్ల కట్ట సంతాన కామేశ్వరి సమేత శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా దేవాలయం నందు బుధవారం స్వామివారికి లక్ష బిల్వార్చన, సహస్ర లింగార్చన సహిత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమృత మృత్యుంజయ పాశుపత రుద్ర అభిషేకాలు జరిగాయని ఆలయ చైర్మన్ చిమట సైదులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గుంటుపల్లి రవీంద్రా చార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
బూరుగడ్డ శివాలయంలో లక్ష బిల్వార్చన




