Wednesday, 4 November 2026

బెత్తం పట్టిన పోలీస్‌లు

ఆదిలాబాద్‌ (మార్చి5) : క్రిమినల్స్‌కు లాఠీ రుచి చూపిస్తూ నిత్యం గొడవలు, కేసులు, బందోబస్తులతో ఉండే పోలీసులు విద్యార్ధుల కోసం కాసేపు లాఠీని పక్కన పెట్టి బెత్తాన్ని పట్టుకున్నారు. ఈ అరుదైన సంఘటన ఆదిలాబాద్‌లో జిల్లాలో జరిగింది. మరికొద్ది రోజుల్లో పదో జరగతి పరీక్షలు జరగనుండడంతో పోలీసులు విద్యార్ధులకు అవగాహనా తరగతులు నిర్వహించారు. జిల్లాలోని మందమర్రిలోని సాయిమిత్ర గార్డెన్‌లో సీఐ సదయ్య, ఎస్సై సతీష్‌ల ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్ధులకు అవగాహనా తరగతులు జరిగాయి. పరీక్షల పేరు వినగానే విద్యార్ధుల్లో భయం మొదలవుతుందని, ముందు వారు భయాన్ని పోగొట్టుకుని ధైర్యంగా పరీక్షలు రాయాలని సీఐ సూచించారు. ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానం రాసి ఆ తర్వాత తెలియని వాటి గురించి ఆలోచించాలని దీని వల్ల సమయం ఆదా అవుతుందని ఆయన విద్యార్ధులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *