Tuesday, 3 November 2026

బెల్ట్‌షాపులను రద్దు చేయుటకు ప్రజలే ముందుకు రావాలన్న జస్టిన్‌ అంబటి లక్ష్మణ్‌రావు

బాగ్‌లింగంపల్లి , హైదరాబాద్‌ : బెల్ట్‌షాపులను తొలగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జస్టిన్‌ అంబటి లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ప్రజలే వాటిని తొలగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బెల్ట్‌షాపులను రద్దుచేస్తామన్న మాటకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కట్టుబడి ఉండాలన్నారు. కొత్త మద్యం పాలసీపై మద్యం నియంత్రణ ఉద్యమ కమిటీ, అప్సాలు సంయ్తంగా సుందరయ్య కళానిలయంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో అయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య, మద్యం నియంత్రణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *