బెల్లంపల్లి పోస్టాఫీసుకు అవార్డు.
బెల్లంపల్లి పట్టణంలోని పోస్టాఫీసుకు అవార్డు దక్కింది. పోస్టల్ సేవలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ఈ అవార్డు దక్కింది. తెలంగాణ లోని 32 జిల్లాలోని పోస్టాఫీసుల్లో మెరుగైన సేవలు అందించడంలో తృతీయ స్థానం సాధించుకుంది. పోస్ట్ మాస్టర్ ఆఫ్ జనరల్ హైదరాబాద్ సిహెచ్ విద్యా సాగర్ చేతుల మీదుగా ఉమ్మడి జిల్లా పర్యవేక్షకుడు కేబీఆర్ ప్రసాద్, మంచిర్యాల డివిజనల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ రావు, అందుకున్నారు. గ్రామీణ తపాలా జీవిత భీమా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు, విభాగంలో అవార్డు రావడం ఉమ్మడి జిల్లాకే గర్వకారణం అని, అవార్డు రావడానికి సహకరించిన ఉద్యోగులకు, ప్రజలకు పోస్టల్ అధికారులు కృతజ్ఞతలు తెలియజేశారు.
బెల్లంపల్లి పోస్టాఫీసుకు అవార్డు.




