సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
రాయికోడ్ జనం సాక్షి నవంబర్ 21 రాయికోడ్ మండలం లోని రాయికోడ్ చౌరస్తా
ఇటీవల జహీరాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం అనిత కమ్యూనికేషన్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరాన్ని సర్పంచ్ రాధిక సతీష్ కుమార్ ప్రారంభించారు. శిబిరంలో రాయికోడ్ మండల పరిధిలోని నాగ్వార్, ఈటికెపల్లి మైపాత్ పూర్ అల్ల పూర్, రాయికోడ్,సిరుర్, గ్రామాలకు చెందిన ప్రజలు ఈ శిబిరం లో పాల్గొని పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు ఈశ్వర్ పాటిల్, డాక్టర్ హరీష్ వర్మ, మైపాల్ వైద్యులు డాక్టర్, పెంటోజీ ఆనంద్ డాక్టర్ రవికళ అల్లపూర్ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఉప సర్పంచ్ రాజశేఖర్ గౌడ్, అనిత కమ్యూనికేషన్ సుభాష్ పాటిల్, రాజు ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.




